ads header

Saturday 9 January 2021

గోల్డ్ రెండు వేలు, సిల్వర్ ఆరు వేలు తగ్గింది

0


 ఇంటర్నేషనల్ మార్కెట్లలో గోల్డ్,సిల్వర్‌ రేట్లు పడిపోవడంతో.. మన దేశంలో కూడా బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. బంగారం ధర తన కీలక మార్క్ రూ.48 వేల నుంచి కిందకు జారింది. గోల్డ్‌తో పాటు ఇతర విలువైన మెటల్స్ సిల్వర్, పెల్లాడియం ధరలు కూడా బాగా పడిపోతున్నాయి. సురక్షితమైన కమోడిటీస్‌లో మళ్లీ డాలర్ పుంజుకోవడంతో గోల్డ్ దిగొస్తోంది. మల్టి కమోడిటీ ఎక్స్చేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి నెలవి రూ.2,086 మేర తగ్గి 10 గ్రాముల ధర రూ.48,818గా నమోదైంది.

సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.6,112 మేర పడిపోయి కేజీ రూ.63,850గా రికార్డయింది. విదేశాల్లో కూడా స్పాట్ గోల్డ్ సుమారు 4 శాతం తగ్గి ఒక ఔన్స్‌కు 1,833.83 డాలర్లకు పడిపోయింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ 4.1 శాతం డౌన్ అయి 1,835.40 వద్ద సెటిలయ్యింది. సిల్వర్ కూడా 9.8 శాతం పడిపోగా.. పెల్లాడియం 2020 నవంబర్ తర్వాత అత్యంత వరస్ట్ వీక్‌ను నమోదు చేసింది. కాగా రిటైల్ మార్కెట్‌లో కూడా బులియన్ ధరలు నేల చూపులే చూస్తున్నాయి.

కరోనాతో పెట్టుబడిదారులందరూ బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించడంతో.. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్‌ టైమ్ హై రూ.56,191కు చేరాయి. ఈ ఏడాది సుమారు 43 శాతం మేర ధరలు పెరిగాయి. సిల్వర్ కూడా కేజీ రూ.80 వేలకు చేరువలోకి వెళ్లింది. అయితే కరోనా వ్యాక్సిన్ వస్తుందనే అంచనాలతో గోల్డ్ ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. 2020 ఆగస్ట్‌లో నమోదైన రికార్డు లెవెల్స్ నుంచి 13 శాతం మేర ధరలు తగ్గాయి. డాలర్ బలపడటం, తాజాగా మరోమారు స్టిమ్యులస్ ప్యాకేజీలు వస్తాయనే అంచనాలతో గోల్డ్ వాల్యు మరింత తగ్గనుందని తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల కనిష్ట స్థాయిల నుంచి డాలర్ ఇండెక్స్ కోలుకుంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే బులియన్ మరింత ఖరీదైనది. టాప్ 17 కన్జూమింగ్ దేశాల్లో గోల్డ్ ధరలు యావరేజ్‌గా 22 శాతం పెరిగాయి. 13 శాతం నుంచి 60 శాతం మధ్యలో ధరలు ఎగిశాయి. అయితే 2021-22లో కూడా ధరలు 20-25 శాతం పెరుగుతాయని ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ ఛైర్‌పర్సన్ అర్వింద్ సహాయ్ అంచనావేస్తున్నారు.

షార్ట్ టర్మ్‌లో గోల్డ్ ధరలు నేల చూపులు చూస్తాయని మేము భావిస్తున్నాం. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫిబ్రవరి ధరలు 10 గ్రాములకు రూ.48,818కు దిగొచ్చాయి. రూ.50,200 వద్ద రెసిస్టెన్స్‌ లెవెల్ గోల్డ్‌కు ఉంది.

Author Image
AboutAUTHOR..

Soratemplates is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design

No comments:

Post a Comment