ads header

Saturday 9 January 2021

ఓ ఇంటివాడు కాబోతున్న వైవా హర్ష..

0


 లాక్ డౌన్ వేళ సినీ స్టార్స్ అంత తమ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి ఓ ఇంటివారు కాగా..తాజాగా ఈ జాబితాలో కమెడియన్ వైవా హర్ష చేరబోతున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో తన టాలెంట్ ఏంటో చూపించిన హర్ష..ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు.రీసెంట్ గా ఓటిటి లో విడుదలైన కలర్ ఫోటో సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం ఇతడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం అక్షరంతో ఇతడి నిశ్చితార్థం జరిగింది.

ఈ మేరకు వైవా హర్ష ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. 'చివరి బ్యాచిలర్‌ సెల్ఫీ' అని క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. జీవితాంతం తను వేలు పట్టుకుని నడవనున్న అక్షర మెడలో దండ వేసి సగం పెళ్లి కానిచ్చేశాడు.

తర్వాత ఆమెతో కలిసి కేక్‌ కట్‌ చేశాడు. వాటి తాలూకా పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో పలువురు యూట్యూబర్లు, సోషల్‌ మీడియా స్టార్లు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పెళ్లెప్పుడన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
Author Image
AboutAUTHOR..

Soratemplates is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design

No comments:

Post a Comment